అడవిలో మంటలు | - | Sakshi
Sakshi News home page

అడవిలో మంటలు

Mar 28 2026 7:48 AM | Updated on Mar 28 2026 7:48 AM

రక్షణ చర్యలు పాటించని అటవీశాఖ

వృక్ష సంపద అగ్నికి ఆహుతి

క్విక్‌ రెస్పాన్స్‌ టీం అలసత్వం..

– మరిన్ని ఫొటోలు 9లోu

కోదండరామాలయంలో కల్యాణం నిర్వహిస్తున్న పండితులు

కాళేఽశ్వరం: వేసవి ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కాటారం డివిజన్‌ పరిధిలోని పలు అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఎండిన ఆకులు, గడ్డి, చెత్తాచెదారం వెంటనే అంటుకొని అడవంతా మంటలు చెలరేగుతున్నాయి. దీంతో అటవీ జీవరాశులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మంటలు వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి మంటలు ఎగిసిపడుతున్నా అధికారులు ఆలస్యంగా చేరడం వల్ల భారీగా అటవీ నష్టం జరుగుతుంది. రాత్రి వేళల్లో పొగతో రోడ్లంతా నిండిపోతున్నాయి. అడవిలో మంటలు ఎగిసిపడుతున్నాయి.

డివిజన్‌లో ఇలా..

కాటారం డివిజన్‌లో మహదేవపూర్‌, పలిమెల, మహాముత్తారం అటవీ ప్రాంతాల్లో నిత్యం మంటలు చెలరేగుతున్నాయి. అదుపు చేసేందుకు ఒక్కో రేంజ్‌కు ఐదుగురితో కూడిన క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ ఉన్నప్పటికీ అవి సమర్థవంతంగా పనిచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అడవిలో జీవించే కొద్ది పాటి జంతువులు దుప్పులు, కుందేలు, కొండగొర్రెలు, నక్క, పక్షులు తదితర జీవరాశులు ప్రమాదాలబారిన పడుతున్నాయని సమాచారం. దీనికితోడు విలువైన అటవీ సంపద కూడా అగ్నికి ఆహుతి అవుతుంది. వీటికి రక్షించడంతో అటవీశాఖ అధికారులు వెనుకంజలో ఉన్నారు. వేసవి కాలంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నందున అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, తగిన సిబ్బందిని నియమించి మంటలు మొదలైన వెంటనే అదుపులోకి తీసుకొచ్చే విధంగా ఉన్నతా ధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

యాత్రస్థలం కావడంతో..

కాటారం నుంచి కాళేశ్వరం ప్రధాన రహదారిపై నిత్యం వేలల్లో వాహనాలు తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో పాటు ముఖ్యంగా కాళేశ్వరం దేవస్థానానికి వచ్చే భక్తులు సైతం రోడ్లపై వాహనాలు నిలిపి వంట చెరుకు తెస్తుంటారు. ఆ క్రమంలో కూడా నిప్పు అంటుకుంటుంది. వంటలు చేస్తుండడంతో కూడా నిప్పుతో మంటలు ఎగసి పడుతున్నాయి. అటవీశాఖ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

మంటలు అదుపులోనే..

అడవిలో ప్రస్తుతం మంటలు అదుపులోనే ఉన్నాయి. మా క్విక్‌రెస్పాన్స్‌ టీం తరుచూ పెట్రోలింగ్‌ చేస్తున్నాయి. ఎలాంటి సమాచారం వచ్చినా నిమిషాల్లోనే మంటలు ఆర్పుతున్నారు. అడవిలో మంటలు పెట్టినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తప్పవు.

– రవికుమార్‌, అటవీశాఖ రేంజర్‌, మహదేవపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement