పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలి..
I
నేడు శ్రీరామనవమిని సందర్భంగా గురువారం రాత్రి కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం రామాలయం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవ మూర్తుల ఎదుర్కోలు సేవా కార్యక్రమం పురవీధులగుండా ఘనంగా నిర్వహించారు. హనుమాన్‌మాలధారణ భక్తులతో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్.మహేష్, సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్, హనుమాన్ మాలదారన స్వాములు పాల్గొన్నారు.
– కాళేశ్వరం
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026
తల్లిదండ్రులు పిల్లలకు టూ, ఫోర్ వీలర్స్ ఇవ్వొద్దు
కాళేశ్వరం: వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ఈనెల 16 నుంచి ఒక్కపూటే నడిపిస్తోంది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత బడి లేకపోవడంతో పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నారు. ఇలా అనేకమంది ఆటా పాటల్లో మునిగితేలుతున్నారు. ఇలాంటి ఆనంద సమయాల్లో విషాదాలు పొంచి ఉంటాయని తల్లిదండ్రులు గ్రహించాలి. దీంతో వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారికి టూ, ఫోర్ వీలర్ వాహనాలు ఇచ్చి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. జిల్లాలోని కాటారం డివిజన్‌లోని పలు మండలాల్లో బావులు, చెరువులు, గోదావరి తీర ప్రాంతాలు ఉన్నాయి. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టిసారించాలి.
బావులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు..
పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ఉపాధిహామీలో మట్టి తీసిన గుంతల్లో నీరు నిల్వ ఉంది. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి. బావుల్లో సరదా కోసం ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పిల్లలు మునిగిపోయిన విషాద ఘటనలు ఏటా పదులసంఖ్యలో ఉంటున్నాయి. డ్రైవింగ్ మోజులో టూ, ఫోర్ వీలర్స్, సైకిళ్లపై మోజుతో కొందరు విద్యార్థులు ఇళ్లలో చెప్పకుండా రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే ఆస్కారం అధికంగా ఉంది. బడి వదలగానే కొందరు పిల్లలు సమయం దొరికిందని ఎండలో ఆడుతారు. దీంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంట్లో ఖాళీగా వీడియో గేమ్స్, టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దృష్టి లోపాలతో పాటు మానసిక బలహీనులుగా మారే అవకాశం ఉంది. వీటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు సరదాగా సమయం కేటాయించి వారితో ఉంటూ ఆటల వైపునకు దృష్టి మళ్లించాలి.
పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎండలు ఎక్కువైనా పిల్లలు ఆహారం తీసుకోరు. వీరికి ఇష్టమైన ద్రవ పదార్థాలు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకునేలా చొరవ తీసుకోవాలి. డీహైడ్రేషన్ కాకుండా చూడాలి.
– సుస్మిత, కాళేశ్వరం పీహెచ్‌సీ వైద్యాధికారి
●
18 ఏళ్లు నిండని విద్యార్థులకు టూ, ఫోర్ వీలర్స్ వాహనాలు ఇవ్వొద్దు. తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటాం.
–ఎన్.వెంకటేశ్వర్లు, సీఐ మహదేవపూర్
జాగ్రత్తలు తప్పనిసరి
ఆడుకుంటూ వెళ్లి
ప్రమాదాల బారిన పడే అవకాశం
ఆటలపై దృష్టి సారించేలా చూడాలి
స్ట్రీట్.. ట్రీట్..
వీధి కుక్కల సంరక్షణకు పలువురు జంతుప్రేమికులు ముందుకొస్తున్నారు.
సెంటర్‌స్ప్రెడ్‌లో u
ఒంటిపూట బడిసమయంలోనూ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి వసతితోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు తిరిగేటట్లు శ్రద్ధ వహించాలి. మధ్యాహ్న భోజనం నీడ కింద కూర్చుని తినేలా ఏర్పాట్లు చేయాలి. ఎండలో ఆటలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


