స్వేచ్ఛగా ఓటు వేయండి
ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దు
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో గల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాత నేరస్తులపై నిఘా, మద్యం, డబ్బు పంపిణీ కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ఎస్పీతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. వివరాలు ఆయన మాటల్లోనే..
– భూపాలపల్లి
జిల్లాలో మూడు విడతల్లో 12 మండలాల్లోని 248 జీపీలు, 2,102 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో కొన్ని పంచాయతీలు, వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయినప్పటికీ జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ముందే గుర్తించాం. మొదటి విడత ఎన్నికలు జరుగనున్న మండలాల్లో 108, 2వ విడతలో 90, 3వ విడతలో 114.. మొత్తంగా 312 సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను గుర్తించాం. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేశాం. పోలింగ్ స్టేషన్, రూట్, క్లస్టర్, మండలాలుగా విభజించుకొని ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాం. ఒక్కో విడత ఎన్నికలకు 500 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
గ్రామాల్లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, మద్యం, డబ్బు, వస్తువుల పంపిణీ, ఘర్షణలు, అల్లర్లు ఏమైనా చోటు చేసుకుంటే తక్షణమే జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎలక్షన్ సెల్ నంబర్ 87126 58178 కు కాల్ చేసి తెలియజేయాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.
జిల్లాలో 312 సమస్యాత్మక
పోలింగ్ బూత్‌లు
పాత నేరస్తుల బైండోవర్,
ప్రతీరోజు గ్రామాల్లో గస్తీ
మద్యం, డబ్బు రవాణా
జరగకుండా పకడ్బందీ చర్యలు
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
స్వేచ్ఛగా ఓటు వేయండి


