శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
యూత్ లీడర్లదే హవా..
న్యూస్‌రీల్
జిల్లాలో ఇలా..
సర్పంచ్, ఉపసర్పంచ్ మనోళ్లు ఉండాలి..
యూత్ అంతా అటు వైపు అడుగులు
పెద్ద లీడర్లు సర్పంచ్ పదవులు ఆశిస్తే రెండో క్యాడర్ లీడర్లంతా ఉపసర్పంచ్ రేసులో దూసుకుపోతున్నారు. కొంత మందికి రిజర్వేషన్లు లేకపోవడంతో ఉపసర్పంచ్ పీఠంపై కన్నేశారు. ఆయా వార్డుల్లో నిత్యం తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. గ్రామంలోని వార్డులన్నింటిలో తమ ప్యానల్ ఏర్పాటు చేస్తున్నారు. కొంత మందికి తమ స్వంతంగా డబ్బులు పెట్టి మరీ రంగంలోకి దించుతున్నారు. యూత్ రాజకీయాల్లోకి రావాలని, తమతోనే అభివృద్ధి సాధ్యమనే నినాదంలో ముందుకు సాగుతున్నారు. రోజూ ఓటర్లకు దావత్‌లు, నజరానాలు ప్రకటిస్తున్నారు. సర్పంచ్‌తో సమానంగా అభివృద్ధి చేస్తానంటూ మాటిస్తున్నారు. దీంతో రాత్రివేళల్లో ఓటర్ల ఇళ్ల వద్ద హడావుడి కనిపిస్తుంది.
మొదటి విడతలో గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లో 82 జీపీలకు 712 వార్డులు, 1,14,007 మంది ఓటర్లు ఉన్నారు. ఈనెల 11న ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజున ఎన్నిక ఫలితాలు వెల్లడిస్తారు.
రెండో విడతలో చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమెల మండలాల్లో 85 జీపీలకు 694 వార్డులు, 88,562 ఓటర్లు ఉన్నారు. ఈనెల 14న ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజున ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.
మూడోవిడతలో మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం, కాటారం మండలాల్లో 81 జీపీలకు 696 వార్డులు, 99,578 మంది ఓటర్లు ఉన్నారు. 17న ఎన్నికలు జరుగనున్నాయి. అదేరోజున ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్వగ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆశావహులు కొంత మంది మంత్రిని బుధవారం కలిశారు. దీంతో ఆయన సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలన్నీ మనోళ్లు గెలువాలని ఆదేశాలు జారీ చేశారని కాంగ్రెస్‌పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్ద లీడర్లు సూచనలు చేశారు. అదే రూటులో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
రిజర్వేషన్లు కలిసిరాక, ఖర్చుకు
భయపడి ఉపసర్పంచ్‌పై దృష్టి
వార్డు సభ్యుల పోటీకి పెరిగిన డిమాండ్
రోజూ విందులు, నజరానాలతో ఓటర్లకు ఎర
శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


