పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కాటారం: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. కాటారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ గురువారం సందర్శించారు. స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, పెండింగ్ కేసులు, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై శ్రీనివాస్ ఉన్నారు.
ఓటు హక్కును వినియోగించుకోవాలి
మల్హర్: ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సంకర్త్ అన్నారు. కొయ్యూరులోని సర్పంచ్, వార్డుల సభ్యుల నామినేషన్ ప్రక్రియను ఎస్పీ సంకీర్త్ పరిశీలించారు. అనంతరం కొయ్యూరు పోలీసుస్టేషన్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, కొయ్యూరు ఎస్సై నరేశ్ పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


