సైన్స్ పండుగ..
ఏడు అంశాల్లో ప్రదర్శనలు
ప్రదర్శనకు తీసుకురావాల్సినవి
భూపాలపలి అర్బన్: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడుతాయి. విద్యార్థుల ప్రతిభకు నాంది పలుకుతాయి. ఇందులో భాగంగా నేడు(శుక్రవారం), రేపు (శనివారం) జిల్లాలో స్థాయి సైన్స్(వైజ్ఞానిక ప్రదర్శన) ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని శాంతినికేషన్ హైస్కూల్‌లో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌లో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్, గురుకులాలు, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎగ్జిబిట్లను ప్రదర్శించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీచేశారు. సుమారు 275 ఎగ్జిబిట్లను ప్రదర్శించే అవకాశం ఉంది. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శిన కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. జిల్లా నుంచి 14 నమూనాలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. ఎగ్జిబిట్ల ప్రదర్శన కోసం ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేసుకున్నారు. 8, 9, 10వ తరగతులను సీనియర్ విభాగంగాను 6, 7 తరగతులను జూనియర్ విభాగంగాను ఎంపిక చేశారు. ప్రతి పాఠశాల నుంచి ఒక్కో అంశానికి ఒక ఎగ్జిబిట్ చొప్పున గరిష్టంగా జూనియర్, సీనియర్ విభాగాలను కలుపుకొని రెండు ఎగ్జిబిట్లను ప్రదర్శించవచ్చు. సబ్జెక్టును బోధించే ఉపాధ్యాయుడు ఒక టీఎల్‌ఎమ్‌ను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది.
నేడు, రేపు జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్
ఏర్పాటు పూర్తిచేసిన అధికారులు
సుస్థిర వ్యవసాయం
వ్యర్ధ పదార్థాల నిర్వహణ, ప్రత్యామ్నాయ మొక్కలు
హరితశక్తి (పునరుత్పాదకశక్తి)
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు
వినోద భరిత గణిత నమూనాలు
ఆరోగ్యం, పరిశుభ్రత
నీటి సంరక్షణ–నిర్వహణ
ప్రదర్శించే ఎగ్జిబిట్‌ను చూపించాలి
వెయ్యి పదాలకు మించని అబ్‌స్ట్రాక్ట్ ఉండాలి
ఎగ్జిబిట్ పేరు, చార్టును ప్రదర్శించాలి
ఎగ్జిబిట్లలో థర్మకోల్, ప్లాస్టిక్ వాడొద్దు


