పాండవుల గుట్టను అభివృద్ధి చేయాలి
రేగొండ: పాండవుల గుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డీవైఎఫ్‌వై జిల్లా అధ్యక్షుడు తిరుపతి అన్నారు. ఆదివారం మండలంలోని రావులపల్లి శివారులోని పాండవుల గుట్టలను కేయూ పరిశోధన విద్యార్థులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పాండవుల గుట్టల అభివృద్ధి పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా మారిందని విమర్శించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పర్యాటకులకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేయూ పరిశోధక విద్యార్థులు రమేష్, ప్రసాద్, తిరుపతి, పసుల వినయ్ కుమార్ పాల్గొన్నారు.


