లక్కు ఎవరికో.. | - | Sakshi
Sakshi News home page

లక్కు ఎవరికో..

Oct 27 2025 8:24 AM | Updated on Oct 27 2025 8:24 AM

లక్కు ఎవరికో..

లక్కు ఎవరికో..

భూపాలపల్లి: మద్యం షాపులకు నేడు లక్కీ డ్రా నిర్వహించనుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ షాపు ఎవరికి దక్కుతుందోనని మద్యం వ్యాపారులు టెన్షన్‌ టెన్షన్‌గా ఉన్నారు. లక్కీ డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎకై ్సజ్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

10 గంటల నుంచి ప్రారంభం..

జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 59 ఏ4 మద్యంషాపులకు 1,863 అప్లికేషన్లు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ. 55.89 కోట్ల ఆదాయం వచ్చింది. గత సారి కంటే ఈ సారి అప్లికేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ దరఖాస్తు రుసుము పెంచడంతో ఆదాయం మాత్రం పెరిగింది. నేటి ఉదయం 10 గంటలకు చల్వాయి, గోవిందరావుపే మినహా 57 షాపులకు జిల్లా కేంద్రంలోని మంజూర్‌నగర్‌లో గల ఇల్లందు క్లబ్‌ హౌజ్‌లో లాటరీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సమక్షంలో నిర్వహించనున్న ఈ ప్రక్రియకు ఎకై ్సజ్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈసారి రంగంలోకి రియల్‌ ఎస్టేటర్లు..

రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పడిపోవడంతో ఆ వ్యాపారం చేసే వారంతా మద్యం వ్యాపారానికి మొగ్గుచూపారు. జిల్లాతో పాటు హనుమకొండ, వరంగల్‌, జనగామ తదితర పట్టణాలకు చెందిన వారు కాళేశ్వరం, మల్లంపల్లి, టేకుమట్ల, భూపాలపల్లి పట్టణంలోని మద్యంషాపులకు భారీగా అప్లికేషన్లు దాఖలు చేశారు. కొత్తగా టెండర్లు వేసిన వీరంతా మొదటి అవకాశం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

డాన్‌లలో గుబులు..

కొంతకాలంగా మద్యం వ్యాపారంలో డాన్‌లుగా పేరొందిన పలువురు భారీ మొత్తంలో అప్లికేషన్లు సమర్పించారు. బెల్లుషాపులు ఎక్కువగా నడిచే, కౌంటర్‌ ఎక్కువయ్యే షాపులను గుర్తించి ఒక్కో షాపుకు పదికి పైగానే దరఖాస్తులు అందజేశారు. ముగ్గురు నలుగురు వ్యాపారులైతే ఏకంగా వంద చొప్పున దరఖాస్తులు చేసినట్లు సమాచారం. గతంలో ఒకటి రెండు షాపులను దక్కించుకున్న వారు గ్రూపులుగా ఏర్పడి ఈసారి అధిక సంఖ్యలో అందజేశారు. వీరంతా నేడు జరుగనున్న లాటరీ డ్రాలో లక్కు ఎవరిని వరించనుందోనని ఉత్కంఠతో ఎదరుచూస్తున్నారు. కొందరైతే ఏకంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకొని వేడుకొని వచ్చారు.

మల్లంపల్లి షాపుపైనే అందరి దృష్టి..

ములుగు జిల్లాలోని మల్లంపల్లి మద్యంషాపునకు అత్యధికంగా 77 అప్లికేషన్లు వచ్చాయి. ఇక్కడి షాపులో రోజుకు సుమారు రూ.5 లక్షల మద్యం విక్రయాలు జరుగుతాయి. ఈ షాపు పరిధిలో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతాయి. మ ద్యం డాన్‌లు, రియల్‌ వ్యాపారులు ఈ షాపుపై అధి కంగా అప్లికేషన్లు వేశారు. దీంతో లాటరీ ప్రక్రియలో ఈ వైన్స్‌ ఎవరికి వస్తుందనే ఆసక్తి నెలకొంది.

నిలిచిన ఆ రెండు షాపుల డ్రా..

ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి తక్కువగా చల్వాయి వైన్స్‌ గెజిట్‌ నంబర్‌ 49కి మూడు, గోవిందరావుపేట గెజిట్‌ నంబర్‌ 50 షాపునకు మూడు దరఖాస్తులు మాత్రమే అందాయి. దీంతో ఎకై ్సజ్‌ కమిషనర్‌, హైదరాబాద్‌ ఆదేశాల మేరకు ఆ రెండు షాపుల డ్రాను నేడు నిలిపివేస్తున్నట్లు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఎంట్రీ పాస్‌ ఉంటేనే అనుమతి..

మద్యం దుకాణాలను దరఖాస్తు చేసుకున్న వారు రశీదు, ఎంట్రీ పాస్‌తో లాటరీ ప్రక్రియకు హాజరు కావాలి. ఎంట్రీ పాస్‌ లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించం. దరఖాస్తుదారులు రాలేని పక్షంలో వారి నుంచి అనుమతి పొందిన వారు ఎంట్రీ పాస్‌తో హాజరు కావాలి.

– శ్రీనివాస్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement