పచ్చదనమే..
మల్హర్: మండలంలోని చిన్నతూండ్ల నుంచి పెద్దతూండ్ల క్రాస్ వద్దకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా పచ్చదనం కనువిందు చేస్తోంది. గతంలో నాటిన మొక్కలను సంరక్షించడంతో ప్రస్తుతం చెట్లుగా మారాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలతో పాటు పొలాలకు వెళ్లే రైతులను చెట్లు ఆకట్టుకుంటున్నాయి. దీంతో కొందరు చెట్ల కింద కొంతసేపు సేదదీరి వెళ్తున్నారు.
ఘనంగా పెద్దమ్మ తల్లి గుడి వేడుకలు
మొగుళ్లపల్లి: మండలకేంద్రంలో ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మతల్లి గుడి వార్షికోత్సవాన్ని ముదిరాజ్ కులస్తులు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక హోమ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మహిళలు బోనాలతో కుటుంబ సభ్యులతో కలిసి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వనం ఒదేలు, రావి శెట్టి రమేష్, నీరటి మహేందర్, చెక్క శ్రీధర్, బోళ్ల సాంబమూర్తి, దేవునూరి కొమురయ్య ఉన్నారు.
27 నుంచి ఎస్‌జీఎఫ్
క్రీడా ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు వివిధ క్రీడాంశాల్లో బాలబాలికలకు ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 27న కరాటే, యోగా, బాస్కెట్‌బాల్, టగ్ ఆఫ్ వార్, టేబుల్ టెన్నిస్, మల్కంబ్, సాఫ్ట్ టెన్నిస్, గట్క, తంగ్‌తా మార్షల్ ఆర్ట్స్, 28వ తేదీన హ్యాండ్‌బాల్, చెస్, షటిల్ బ్యాడ్మింటన్, హాకీ, బెల్డ్ రెజ్లింగ్, సైక్లింగ్, స్కేటింగ్, బేస్‌బాల్, బీచ్ వాలీబాల్, 29న ఖోఖో, బాక్సింగ్, స్విమ్మింగ్, రగ్బీ, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, ఫెన్సింగ్, కలారీ పయట్టు, కురేష్, అథ్లెటిక్స్, 30న క్యారమ్స్, ఉషు, క్రికెట్, నెట్‌బాల్, సాఫ్ట్‌బాల్, జూడో, లాన్‌టెన్నిస్, జిమ్నాస్టిక్స్, షూటింగ్ క్రీడల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
హాస్టళ్లలో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని పీజీ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం(2025–26) ప్రవేశాలు పొందిన ఫస్టియర్ విద్యార్థులు హాస్టళ్లలో వసతి, మెస్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్‌పీ రాజ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. హెచ్‌టీటీపీఎస్//కేయూకాలేజెస్.కో.ఇన్,/హాస్టల్స్ /న్యూఅడ్మిషన్స్‌లో ఫీజు చెల్లించి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని, రశీదు జత చేసి పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. దీంతోపాటు సంబంధిత విభాగాధిపతి ద్వారా కాలేజీ అలాట్‌మెంట్ ఫార్మ్, హాస్టల్ అడ్మిషన్ రశీదును ప్రిన్సిపాల్ ఆఫీస్ నుంచి అడ్మిషన్ రశీదును సమర్పించాలని పేర్కొన్నారు.
పచ్చదనమే..


