మద్యం షాపులకు 1,658 దరఖాస్తులు
భూపాలపల్లి: మద్యంషాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. అప్లికేషన్ల సంఖ్య గతంలో కంటే తగ్గినప్పటికీ దరఖాస్తు రుసుం పెంచిన కారణంగా ఆదాయం మాత్రం పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 59 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు అప్లికేషన్లను స్వీకరించగా 1,658 దరఖాస్తులు వచ్చి రూ.49.74 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ కారణాలతో ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచింది. దీంతో గురువారం రాత్రి 10 గంటలకు వరకు 1,817 దరఖాస్తులు అందగా.. రూ. 54.51 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు.
పెరిగిన ఆదాయం..
2023–2025 సంవత్సరంలో భూపాలపల్లి, ములు గు జిల్లాలోని మద్యంషాపులకు 2,161 దరఖాస్తులు రాగా రూ.43 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏ డాది దరఖాస్తు రుసుం రూ.3 లక్షలకు పెంచడంతో 1,817 దరఖాస్తులకు రూ. 54.51 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తు రుసుంపెంచడంతో అప్లికేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం పెరిగింది.
అత్యధికంగా.. అత్యల్పంగా..
ములుగు జిల్లాలోని మల్లంపల్లి మద్యంషాపునకు అత్యధికంగా 77 దరఖాస్తులు వచ్చాయి. గోవిందరావుపేట, రంగాపూర్ జీపీ పరిధిలోని షాపునకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. చల్వాయి షాపునకు ఒకటి మాత్రమే రాగా, జేఎస్‌బీ 49 నంబరు గల చల్వాయి(వి) షాపునకు ఒకటి, జేఎస్‌బీ 53 నంబరు గల తాడ్వాయి, మేడారం, ఊరట్టం షాపునకు రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
సర్కారుకు రూ.54.51కోట్ల ఆదాయం
అప్లికేషన్లు తగ్గినా.. పెరిగిన ఆదాయం
గడువు పెంపుతో వచ్చిన దరఖాస్తులు 159


