
టెన్త్‌పై ఫోకస్
ప్రత్యేక కార్యాచరణ ఇదే..
చిట్యాల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులను పరిశీలిస్తున్న డీఈఓ రాజేందర్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండే విధంగా జిల్లా విద్యాశాఖ అఽధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గతేడాది జిల్లా పదో తరగతి ఫలితాల్లో వెనుకబడిపోయింది. జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణను వారం రోజుల క్రితం నుంచి ప్రారంభించారు.
3,600మంది విద్యార్థులు
జిల్లాలోని 12 మండలాల్లోని 157 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో 3,600 మంది పదో తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రత్యేక తరగతు ల కార్యాచరణ ప్రణాళికలను జిల్లా ఇన్‌చా ర్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తయారు చేసి పా ఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించారు. ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతీ రోజు అదనంగా గంట పాటు
ప్రతి రోజు సాయంత్రం 4.15గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహణను మండల విద్యాశాఖ అఽధికారులు, సెక్టోరియల్ అధికారులు పర్యవేక్షణ చేసి ప్రగతిని డీఈఓకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా విద్యార్థుల సామర్‌ాధ్యలను అందజేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు పాఠాల బోధనతో పాటు స్లిప్ టెస్టులు పెడుతున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి పాస్ కావాలి. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి. రాష్ట్రంలో ప్రఽథమ స్థానం సాధించడానికి ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక తరగతుల కార్యాచరణ ప్రణాళికలను కచ్చితంగా కట్టుదిట్టంగా అమలు చేయాలి. విద్యార్థులకు అన్ని సబ్జెక్టులపై పూర్తిస్థాయి పాఠాలు నేర్పించి వారి అనుమానాలను నివృత్తి చేయాలి. పక్కా ప్రణాళికలతో ప్రతి రోజు గంట పాటు అదనంగా చదివిస్తున్నాం.
– రాజేందర్, ఇన్‌చార్జ్ డీఈఓ
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ
సాయంత్రం అదనపు క్లాసుల నిర్వహణ
డిసెంబర్ 31వ తేదీ వరకు విద్యార్థులకు
సిలబస్‌ను పూర్తిచేయాలి
ప్రత్యేక తరగతుల నిర్వహణ సమయంలో సంబందిత ఉపాధ్యాయుడికి సెలవు మంజూరు చేయవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి.
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ప్రతి అధ్యాయం పున:శ్చరణ చేయాలి.
పరీక్ష మార్గదర్శకాలకు అనుగణంగా పాఠశాల స్థాయిలో పరీక్ష పత్రాలను తయారు చేయాలి.
షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు స్లిప్ టెస్టులు నిర్వహించాలి
చదువులో వెనుకబడిన పిల్లలకు సవరణాత్మక బోధన చేయాలి.
ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులను గుర్తించి దత్తత చేసుకోవాలి.
తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల సామర్ధ్యాలను తల్లిదండ్రులకు తెలియజేయాలి.

టెన్త్‌పై ఫోకస్