
సీఎంఆర్‌ఎఫ్ నిరుపేదలకు వరం
భూపాలపల్లి రూరల్/చిట్యాల/రేగొండ: ముఖ్య మంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఒక వరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, చిట్యాల, రేగొండలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారికి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకతీఽతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటుందని తెలిపారు. భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షులు నర్సయ్య, గుట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ట, చిట్యాల మార్కెంట్ కమిటి వైస్ చైర్మన్ ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు