
ప్రజల విశ్వాసం పొందేలా పనిచేయాలి
భూపాలపల్లి: విధి నిర్వహణలో ప్రజల విశ్వాసం పొందే విధంగా పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివస్ కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 21మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలు విన్న వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. బాధితులకు సరైన సమయంలో న్యాయం జరిగినప్పుడే పోలీసుల పట్ల గౌరవం, నమ్మకం కలుగుతుందని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే