
మెడికల్ బోర్డు నిర్వాకంతో ఆందోళన
భూపాలపల్లి అర్బన్: సింగరేణి మెడికల్ బోర్డు విధానాలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని, హయ్యర్ సెంటర్ పేరుతో నిమ్స్‌కు పంపిన 47మంది కార్మికులను వెంటనే మెడికల్ బోర్డులో ఆన్‌ఫిట్ చేసి వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం భూపాలపల్లి ఏరియాలోని కొమురయ్య భవన్‌లో బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏసీబీ, విజిలెన్స్ సోదాలని కార్మిక వర్గంలో ఇతరుల మీద సోదాలు నిర్వహించి భయాందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై ఏఐటీయూసీ డైరెక్టర్‌తో చర్చించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు మాతంగి రామచందర్, గురుజపెల్లి సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, విజేందర్, తాళ్ల పోశం పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్