
శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025
–8లోu
మధ్యాహ్న భోజన కార్మికులకు
గ్యాస్ కనెక్షన్లు
పాఠశాలలన్నింటికీ
కనెక్షన్లు
ఇటీవల ప్రభుత్వం అన్ని పాఠశాలలకు నాణ్యమైన వంటపాత్రలు అందించింది. గ్యాస్ కనెక్షన్లు కూడా ఇస్తుండటంతో విద్యార్థులకు శుభ్రమైన భోజనం అందించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆయా మండలాల పరిధిలో స్థానిక ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. వంట కార్మికులకు గ్యాస్ సిలిండర్, స్టౌవ్ ఉచితంగా అందిస్తుండగా గ్యాస్ మాత్రం కార్మికులే నింపుకోవాలి. పథకం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చుతున్నాయి.
● జిల్లావ్యాప్తంగా 409 పాఠశాలల గుర్తింపు
● ఆగస్టు 15లోగా
కనెక్షన్లు పూర్తిచేయాలని ఆదేశం
● రాయితీపై గ్యాస్‌సిలిండర్ ఇవ్వాలని వినతులు
కాళేశ్వరం: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా 409 పాఠశాలలను గుర్తించారు. ఆగస్టు 15లోగా అన్ని పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు వెలుబడ్డాయి. భోజన తయారీలో ఆలస్యం, పొగచూరడం, ఇతరత్రా సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని మధ్యాహ్న భోజన కార్మికులు అంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లావ్యాప్తంగా 430 పాఠశాలల్లో 20వేల మంది విద్యార్థులు, 900మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. 409 పాఠశాలల్లో కట్టెల పొయ్యి మీద వండుతున్నట్లుగా గుర్తించి కనెక్షన్లు మంజూరు చేసింది. గత నెలలో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించిన కేంద్ర బృందం కట్టెల పొయ్యితో భోజనం తయారీ వల్ల మహిళా కార్మికులు పడుతున్న బాధలను స్వయంగా చూసింది. పొగ వల్ల కార్మికులకే కాకుండా విద్యార్థులకు శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించి ప్రభుత్వాలకు సూచించగా అమలుకు శ్రీకారం చుట్టారు. గ్యాస్ కనెక్షన్లతో భారంగా మారే అవకాశం ఉందని, రాయితీ కింద గ్యాస్ ఇవ్వాలని వంట వండే మహిళలు కోరుతున్నట్లు తెలిసింది.
●
న్యూస్‌రీల్

శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025