
ఆగస్టు 4 నుంచి ఉచిత శిక్షణ కార్యక్రమాలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని సింగరేణి జీవీటీసీలో ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టీఏఎస్‌కే) శిక్షణ కేంద్రంలో ఆగస్టు 4వ తేదీ నుంచి ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ మురళీకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత టెక్నికల్, నాన్ టెక్నికల్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు వివరించారు. ఈ శిక్షణకు డిప్లోమా, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, పీజీ, ఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాల నిర్వహణ వలన యువతలో నైపుణ్యలను పెంపొందించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచనున్నట్లు చెప్పారు. వివరాలకు 96184 49360 ఫోన్‌నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
108 వాహనం తనిఖీ
మల్హర్: మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 108 అంబులెన్స్‌ను 108 జిల్లా మేనేజర్ మేరగు నరేష్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనంలోని ముందులు, మెడికల్ ఎక్విప్మెంట్స్, రికార్డులు, కండీషన్‌ను పరిశీలించారు. మూడు నెలల పర్ఫామెన్స్‌పై సిబ్బందితో నరేష్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108కి ఫోన్ రాగానే మండల ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భాస్కర్, పైలెట్ సంపత్ ఉన్నారు.