
విద్యాసంస్థల బంద్ ప్రశాంతం
భూపాలపల్లి అర్బన్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు అంబేడ్కర్ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల నాయకులు సొత్కు ప్రవీణ్‌కుమార్, కుమ్మరి రాజు, జోసెఫ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులను తగ్గించాలని, ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శేఖర్, మణికంఠ, వరుణ్, వికాస్, రాజేష్, అజయ్, పవన్, విష్ణు, హర్షవర్ధన్ పాల్గొన్నారు.