అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

Jul 24 2025 7:38 AM | Updated on Jul 24 2025 7:38 AM

అప్రమ

అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పొంగుతున్న వాగులు, చెరువులు, నదుల్లోకి వెళ్లవద్దని, సెల్ఫీలు, రీల్స్‌ చేసేందుకు అనుమతి లేదన్నారు. వర్షంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, సెల్‌ టవర్లు, చెట్ల కింద నిలబడవద్దన్నారు. విద్యుత్‌ ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సహాయం కోసం లేదా ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు కంట్రోల్‌ రూం నంబర్‌ 90306 32608 కు కాల్‌ చేయాలని ప్రజలకు సూచించారు.

పోలీస్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు..

జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసర సమయంలో డయల్‌ 100 లేదా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నంబర్‌ 87126 58129ను సంప్రదించాలని ఎస్పీ కిరణ్‌ ఖరే సూచించారు. రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జలాశయాల్లోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు.

అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌
1
1/1

అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement