
25నుంచి రేషన్‌కార్డుల పంపిణీ
భూపాలపల్లి: జిల్లాలో రేషన్‌కార్డుల పంపిణీపై సమావేశం నిర్వహించి ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు రేషన్ కార్డులు పంపిణీకి అన్ని మండలాల వారీగా షెడ్యూల్ తయారు చేయాలని ఆదేశించారు. మంగళవారం నానో యూరియా గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎరువులు, విత్తన దుకాణాల్లో తప్పనిసరిగా స్టాకు బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయాఽధికారి బాబు, ఇరిగేషన్ ఈఈలు తిరుపతిరావు, ప్రసాద్, పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ