
శాంతిభద్రతల పర్యవేక్షణకు కృషి
భూపాలపల్లి రూరల్/రేగొండ: శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కొత్తపల్లిగోరి పోలీస్‌స్టేషన్, జిల్లా గంథ్రాలయం, వృత్తి శిక్షణా కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సమాజంలో శాంతి భద్రతలు, చట్టవ్యవస్థ పటిష్టంగా ఉండేలా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి శిక్షణా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ కేంద్రాలు యువత తమపై తాము ఆధారపడేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. సింగరేణి, జెన్‌కో వంటి ప్రాంతాలలో ఉపాధి అవకాశాల కోసం నిరుద్యోగ యువతకు ఈ కేంద్రాలు ఉపాధి కల్పన వేదికగా నిలవాలని చెప్పారు.
యువతకు స్కిల్ శిక్షణ కార్యక్రమాలు
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఎంబీఏ తదితర ఉన్నత విద్యనభ్యసించిన నిరుద్యోగ యువతకు స్కిల్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నైపుణ్యం కలిగిన యువతకు బహుళ జాతి సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయని, టాస్క్ ద్వారా 50 పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు సింగరేణి, విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. అంతకుముందు కొత్తపల్లిగోరి మండలానికి మొదటి ఎస్సైగా సాకపురం దివ్య మంత్రుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకేంద్రంలోని భాస్కర గడ్డలో రెండు పడక గదుల ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందించారు. నూతన బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఎస్పీ సంపత్‌రావు, సీఐ మల్లేష్, తహసీల్దార్లు లక్ష్మిరాజయ్య, శ్వేత, ఎంపీడీఓ వెంటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.
యువతకు ఉపాధి కల్పన ధ్యేయం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఆర్థిక ఇబ్బంది ఉన్నా.. అభివృద్ధే లక్ష్యం
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై
జర్నలిస్టుల నిరసన
– వివరాలు 8లోu
– వివరాలు 9లోu

శాంతిభద్రతల పర్యవేక్షణకు కృషి