
గోదావరి ముంపు ప్రాంతం పరిశీలన
వాజేడు: సరిహద్దులోని గోదావరి ముంపు ప్రాంతాన్ని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సోమవారం పరిశీలించారు. మండల పరిధిలోని పేరూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో పాటు స్టేషన్ సెక్యూరిటీకి సంబంధించి పలు వివరాలు సూచించారు. అనంతరం మండల పరిధిలోని టేకులగూడెం గ్రామం చివరన రేగు మాగు ఒర్రె వద్ద గోదావరి ముంపునకు గురయ్యే ప్రదేశాన్ని సందర్శించారు. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. యువత డ్రగ్స్‌కు అలవాటు పడకుండా కట్టు దిట్టమైన చర్యలను చేపట్టాలన్నారు. ఏఎస్పీ వెంట వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు.