
నేడు మంత్రుల పర్యటన
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గంలో నేడు(సోమవారం) మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్లపల్లిగోరి పోలీస్‌స్టేషన్ ప్రారంభం, గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో బస్‌స్టాండ్ పనులకు శంకుస్థాపన అనంతరం గ్రామంలో సభ ఉంటుందన్నారు. భూపాలపల్లి భాస్కర్‌గడ్డలో డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించి, అనంతరం ఎస్పీ కార్యాలయంలో టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లా గ్రంథాలయం ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. మంత్రులతో పాటు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొంటారని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, పిప్పాల రాజేందర్, బుర్ర కొమురయ్య, చల్లూరి మధు. బట్టు కరుణాకర్, ఆకుల మహేందర్, శిరుప అనిల్, ముంజాల రవీందర్, కురిమిల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.