
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
మల్హర్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మండలంలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో కాటారం సీఐ నాగార్జునరావుతో కలిసి 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురవాలంటే వాతావరణం సమత్యులంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దీంట్లో భాగంగానే ప్రభుత్వం వన మహోత్సవానికి శ్రీకారం చుట్టుందని పేర్కొన్నారు. విరివిగా మొక్కలు నాటి అటవీ విస్తీర్ణం పెంపునకు కృషి చేసి భావితరాల భవిష్యత్‌కు తోడ్పాడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
కాటారం డీఎస్పీ సూర్యనారాయణ