
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
● ఫారెస్ట్ రేంజర్ రాజేశ్వర్‌రావు
మల్హర్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కొయ్యూరు ఫారెస్ట్ రేంజర్ రాజేశ్వర్‌రావు, మోడల్ స్కూల్ ప్రిన్స్‌పాల్ పూర్ణ చందర్‌రావు తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ ఆవరణలో శుక్రవారం అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురవాలంటే వాతావరణం సమత్యులంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దీంట్లో భాగంగానే ప్రభుత్వం వనమహోత్సవానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ లక్ష్మణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.