సోషల్‌ ఆడిట్‌ అభ్యంతరాలపై సమావేశం | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ ఆడిట్‌ అభ్యంతరాలపై సమావేశం

Jul 12 2025 9:41 AM | Updated on Jul 12 2025 9:41 AM

సోషల్‌ ఆడిట్‌ అభ్యంతరాలపై సమావేశం

సోషల్‌ ఆడిట్‌ అభ్యంతరాలపై సమావేశం

పలిమెల: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పనులు, వనమహోత్సవం, సోషల్‌ ఆడిట్‌ అభ్యంతరాలపై అధికారులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మంజుల, ఎంపీడీఓ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల సామాజిక తనిఖీల్లో వచ్చిన అభ్యంతరాల తొలగింపు కోసం రిప్లై ఇవ్వాలని మండల అధికారులకు సూచించారు. రానున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్లాంటేషన్‌ కోసం అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఓ శ్రీకాంత్‌, పంచాయతీ కార్యదర్శులు పీటర్‌ పాల్‌, శ్రీధర్‌, వినయ్‌కృష్ణ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ శ్రీకాంత్‌, సాంబశివరావు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement