
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
కాటారం: దీ కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని ప్ర భుత్వ హై స్కూల్‌లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. బ్యాంక్ ఖాతా ప్రాముఖ్యత, బ్యాంకింగ్ సేవలను గూర్చి బ్యాంక్ మేనేజర్ హరిరామ్‌నాయక్ విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మేనేజర్ మా ట్లాడుతూ.. బ్యాంక్ ఖాతా కల్గి ఉండటం తప్పనిస రి అని దాని వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చన్నారు. అనంతరం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పుట్టిన రోజు పురస్కరించుకొ ని విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఫీల్డ్ ఆఫీసర్ రాజిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.