
మహాసభల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 13, 14న రేగొండ మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌ఎన్ గార్డెన్‌లో నిర్వహించనున్న సీపీఐ 5వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయలో మహాసభ వాల్‌పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. మహాసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు రామచందర్, సుధాకర్‌రెడ్డి, సోతుకు ప్రవీణ్‌కుమార్, కొరిమి సుగుణ, సతీష్, జోసెఫ్, శ్రీకాంత్, లా వణ్య, సంధ్య, లావణ్య, రమేష్ పాల్గొన్నారు.
మల్హర్: భారత కమ్యూనిస్టు పార్టీ 5వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్‌కుమార్ అన్నారు. సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కుమారస్వామి ఆధ్వర్యంలో మండల కేంద్రం తాడిచర్లలో శుక్రవారం 5వ జిల్లా మహాసభల వాల్‌పోస్టర్‌ను ప్రవీణ్‌కుమార్ ఆవిష్కరించి మాట్లాడారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ 99 వసంతాలను పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ జిల్లా మహాసభలను ఈ నెల 13, 14న రేగొండ ఎస్‌ఎల్‌ఎన్ గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్‌రావు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మహాసభలను ప్రజలు, మేధావులు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్, గ్రామశాఖ కార్యదర్శి ఎండీ రహీమ్, మండల శాఖ సహాయ కార్యదర్శి యాషాడపు రాజయ్య పాల్గొన్నారు.
రేగొండ: మండలంలో ఈ నెల 13న నిర్వహించే సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహయ కార్యదర్శి శాంతికుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మహాసభల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మండల కార్యదర్శి పెంట రవి, సీనియర్ నాయకుడు సమ్మిరెడ్డి, చంద్రమౌళి, రాజేందర్, ఆగయ్య, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.