
గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్ట్
గణపురం: మండలంలోని గాంధీనగర్‌లో గంజాయి తరలిస్తున్న బెడ్డల శ్రీనివాస్ అనే యువకుడిని అరెస్టు చేసి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చిట్యాల సీఐ మల్లేష్, ఎస్సైరేఖ అశోక్‌లు తెలిపారు. పోలీస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం గణపురం ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు గాంధీనగర్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతని వద్దకు వెళ్లే క్రమంలో పారిపోతుండగా పట్టుకున్నారు. కాగా అతడిని విచారించి మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన బెడ్డల శ్రీనివాస్‌గా గుర్తించారు. శ్రీనివాస్ హైదరాబాద్‌లో ఒక క్లబ్‌లో కొన్ని రోజులుగా పని చేస్తుండగా అక్కడ మహారాష్ట్రకు చెందిన సల్మాన్ మాజీత్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. కాగా సల్మాన్ మాజీత్ ఖాన్ వద్ద గంజాయి తీసుకువచ్చిన శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన బాల్య మిత్రుడు ప్రేమ్‌తేజ్ సాయంతో ఇక్కడ గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో గంజాయి తీసుకువచ్చిన శ్రీనివాస్ అతడి మిత్రుడు ప్రేమ్‌తేజ్ కోసం ఎదురు చూస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కాగా గంజాయిని స్వాధీనం చేసుకోని శ్రీనివాస్‌ను రిమాండ్ తరలించారు. సల్మాన్ మాజీత్ ఖాన్, ప్రేమ్‌తేజ్‌లో పరారిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.