
వైద్యులను నియమించకుంటే దీక్ష
చిట్యాల: చిట్యాల సివిల్ ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వెంటనే వైద్యులను నియమించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. నెలరోజుల్లో నియమించకుంటే నిరాహార దీక్ష చేపడుతామని చెప్పారు. గురువారం చిట్యాల సివిల్ ఆస్ప్రతిని ఆయన సందర్శించి రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో 18మంది వైద్యులకు గానూ ఆరుగురు మాత్రమే పనిచేస్తుండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన వారిని భూపాలపల్లి, వరంగల్‌కు పంపిస్తున్నారని చెప్పారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌ను నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వైద్యులను నియమించాలని కలెక్టర్‌కు ఫోన్‌చేసి కోరారు.
యూరియా అందుబాటులోకి తీసుకురావాలి
రైతులకు యూరియాను అందుబాటులోకి తీసుకరావాలని ప్రభుత్వాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో, వ్యవసాయ కేంద్రాలలో యూరియా దొరకడం లేదని రైతులు ఆందోళన చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, మండల ప్రధాన కార్యదర్శులు ఏరుకొండ రాజేందర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
చిట్యాల సివిల్ ఆస్పత్రిలో
అందని వైద్యసేవలు
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి