
దివ్యాంగులు హక్కుల కోసం ఉద్యమించాలి
ములుగు రూరల్: దివ్యాంగులు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బానోతు భద్రునాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మానసికధైర్యంతో ది వ్యాంగులు జీవనం కొనసాగించాలని సూచించా రు. అనంతరం జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూజారి మాణిక్యం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పెద్దబోయిన శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజు, శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా సురేష్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు మంచోజు చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.