
భలే..భలే.. బొచ్చ చేప
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహితకు వరద తాకిడి పెరుగుతుంది. ఆదివారం గోదావరి, ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన జాలర్లు చిన్న నావలపై చేపల వేట చేపట్టారు. దీంతో వారికి వివిధ రకాలైన చేపలు తమ వలలకు చిక్కాయి. అందులో బొచ్చ జాతికి చెందిన పెద్ద చేప చిక్కింది. ఎనిమిది కిలోల వరకు ఉంటుందని జాలర్లు పేర్కొంటున్నారు. జీవనోపాధికోసం నిత్యం నదిపై జీవన పోరాటం చేస్తుంటామని తెలిపారు.
– కాళేశ్వరం
గోదావరిలో నావపై చేపలు పడుతున్న జాలర్లు

భలే..భలే.. బొచ్చ చేప