
పేదల పక్షాన పోరాడిన గాజర్ల రవి
● ఎమ్మెల్యేలు గండ్ర, రేవూరి
టేకుమట్ల: సామాన్య కుటుంబంలో జన్మించిన గాజర్ల రవి చిన్నతనం నుంచే బడుగు, బలహీన వర్గాల కోసం పేద ప్రజల పక్షాన పోరాటం చేశాడని భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఈ నెల 18న ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గాజర్ల రవి సంస్మరణ సభ వెలిశాలలో సోమవారం నిర్వహించారు. గాజర్ల రవి కుటుంబసభ్యులను ఎమ్మెల్యేలు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసం రవి చిన్నతనంలోనే అడవిబాట పట్టాడన్నారు. సంస్మరణ సభకు అభిమానులు, సానుభూతిపరులు, ప్రజాసంఘాల నేతలు భారీగా తరలివచ్చారు.
ఎమ్మెల్సీ సిరికొండ పరామర్శ
గాజర్ల రవి సంతాపసభకు ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరయ్యారు. రవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పలు గ్రామాలలో మరణించిన వారి కుటుంబ సభ్యులను అనంతరం పరామర్శించారు. రామకృష్ణాపూర్ గ్రామంలో రెండు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. ఆయన వెంట కార్మిక శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయకులు నిమ్మల స్వామి, శంకర్, తిరుపతి పాల్గొన్నారు.