
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
● టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీందర్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: మెడికల్ కళాశాలలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలంగాణ మెడికల్ సైన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) ఎండీ ఫణీందర్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ రాహుల్‌శర్మ, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావుతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, జీజీహెచ్‌లను బుధవారం ఆయన పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల, హాస్టల్, ఆస్పత్రి భవనాలతోపాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని వార్డులు, ప్రయోగశాలలు, తరగతి గదులు, పరికరాలను పరిశీలిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈ సంవత్సరం ఎంబీబీఎ స్ అడ్మిషన్లు ప్రారంభమవుతున్న తరుణంలో వి ద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందు కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు వైద్య కళాశాల, ప్రభుత్వ ప్రధా న ఆస్పత్రిలో అన్ని విభాగాలను పరిశీలించి నివేదికను వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శికి సమర్పించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. విద్యార్థుల వసతి సౌకర్యాలకు సింగరేణి సంస్థ నుంచి ప్రత్యేక బ్లాక్ కేటాయించనున్నట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న బ్లాకులు, ల్యాబ్‌లు, మెడికల్ పరికరాలను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. వైద్యకళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నవీన్‌కుమార్, ఈఈ ప్రసాద్ పాల్గొన్నారు.