తెలంగాణ రన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ రన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Mar 27 2026 9:13 AM | Updated on Mar 27 2026 9:13 AM

జనగామ: తెలంగాణ రన్‌లో భాగంగా జిల్లా కేంద్రంలో ఏప్రిల్‌ 5వ తేదీ ఉదయం 6 గంటలకు బతుకమ్మకుంట వద్ద నిర్వహించనున్న 2 కేఎం, 5 కేఎం, 10 కేఎం రన్‌ కార్యక్రమ పోస్టర్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బా లమణి శ్రీనివాస్‌ గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి రన్‌లు ఎంతో ఉపయోగకరమని, భారీసంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్‌ పాముకుంట్ల ప్రసాద్‌గౌడ్‌, రన్‌రేస్‌ డైరెక్టర్‌ వంగాల పురుషోత్తంరెడ్డి, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు నారోజు రామేశ్వరచారి, పోచయ్య, కుమారస్వామి, నరేష్‌, మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement