పతుల రాజకీయంలో సతులే సర్పంచులు
దేవరుప్పుల: ఒక్క సారి కాదు..రెండోసారి కూడా పతులు రాజకీయం చేస్తే అనివార్యంగా రెండోసారి సతులు సర్పంచ్‌లు కావడం ప్రత్యేకత సంతరించుకుంది. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని మున్‌పహాడ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పదిహేను ఏళ్ల కిందట బీసీ మహిళ రిజర్వ్ కావడంతో అనివార్యంగా తన భార్య బాలమ్మ బరిలో నిలిపి గెలిచారు. ఇలాగే ధర్మగడ్డతండాకు చెందిన బీఆర్‌ఎస్ మండల నాయకుడు భూక్య జనార్దన్ గతంలో ఎస్టీ మహిళ రిజర్వు కావడంతో టీడీపీ నుంచి ఆయన భార్య అరుణకు సర్పంచ్ పదవి వరించింది. ఈ ఎన్నికల్లో సైతం మున్‌పహాడ్, ధర్మగడ్డతండా గ్రామాలు సర్పంచ్ మహిళ రిజర్వు కావడంతో మరోసారి వారి భార్యలను బరిలో నిలిపి సర్పంచ్‌లుగా గెలిపించుకున్నారు.
పారుపెల్లి బాలమ్మ శ్రీనివాస్, భూక్య అరుణ జనార్దన్
పతుల రాజకీయంలో సతులే సర్పంచులు


