నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
● ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి
జనగామ: రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని జనగామ పట్టణ పరిధిలో నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా లోడ్ సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుందని ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం డీటీఆర్‌లను బిగించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వినియోగదారుల అవసరాలను ముందుగానే అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా 7–100 కేవీఏ డీటీఆర్‌ల స్థానంలో ఆధునిక సామర్థ్యంతో కూడిన మరో 7–60 కేవీఏ డీటీఆర్‌లను ఏర్పాటు చేశామన్నారు. వీవర్స్ కాలనీలో ఎస్‌ఎస్–3, నెహ్రూపార్కు ఏరియాలో ఎస్‌ఎస్–13, గిర్నిగడ్డలో ఎస్‌ఎస్–1, గీతానగర్‌లో ఎస్‌ఎస్–34, సెయింట్ మేరీస్ స్కూల్ రోడ్‌లో ఎస్‌ఎస్–149, సాన్‌మారియా గేట్, జ్యోతి నగర్‌లో ఎస్‌ఎస్–378, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం, సూర్యాపేట రోడ్ పరిధిలో ఎస్‌ఎస్–337 ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. సామర్థ్యం అప్‌గ్రేడేషన్‌తో వేసవిలో లోడ్, తక్కువ వోల్టేజ్ సమస్యలు తగ్గి, వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేందుకు వీలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, టౌన్–1 ఏఈ సౌమ్య, టౌన్–2 ఏఈ చంద్రమోహన్, సిబ్బంది తదితరులు ఉన్నారు.


