మెరుగైన వైద్యసేవలందించాలి
జనగామ రూరల్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సోమవారం గూగుల్ మీట్ ద్వారా ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ కె.మల్లికార్జునరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రోగ్రాం అధికారులు మెడికల్ ఆఫీసర్ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకంగా ఆర్‌బీఎస్‌కే, టీకా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు, పర్యవేక్షణ నివేదికల సమర్పణపై మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా క్షేత్రస్థాయిలో వైద్యసేవలను మరింత బలోపేతం చేయడం, సమయానికి నివేదికల సమర్పణ, నాణ్యమైన సేవలు అందించాలని ఆయన సూచించారు.


