ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
జనగామ రూరల్: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ చెప్పారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శని వారం పెంబర్తి, సిద్దెంకి, ఒబుల్‌కేశవాపూర్, ఎర్రగొల్లపహాడ్ గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండారీ చేతన్ నితిన్, సీఐలు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
నర్మెట: మండల కేంద్రంతో పాటు బొమ్మకూర్‌లో సాయంత్రం భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. డీసీపీ రాజమహేంద్రనాయక్ వెంట ఏసీపీ రమణబాబు, సీఐలు ముసుకు అబ్బయ్య, ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.
తరిగొప్పుల: మండలకేంద్రంతో పాటు, నర్సాపూర్, బొత్తలపర్రె గ్రామాల్లో కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ , ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ అబ్బయ్య, ఎస్సై గుగులోతు శ్రీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
డీసీపీ రాజమహేంద్ర నాయక్


