నెల్లుట్ల సర్పంచ్‌కు 1,001 ఓట్ల ఆధిక్యం
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్లకు చెందిన నర్సింగ రామకృష్ణకు మండలంలోని 21 పంచాయతీల్లో అత్యధికంగా 1,001 ఓట్ల మెజారిటీ సాధించారు. నెల్లుట్లలో 4,885 ఓట్లకు గాను 4,058 ఓట్లు పోలైయ్యాయి. అందులో 1,946 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థికి 945 ఓట్లు, నల్ల అనిల్‌కుమార్‌కు 649, చెపూరి ఉపేందర్‌కు 207, నల్ల కుమారస్వామి 102, నల్ల విజయ్‌కు 79 ఓట్లు వచ్చాయి. తిరస్కరించినవి 104, నోటాకు 26 ఓట్లు వచ్చాయి. రెండోస్థానంలో లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన ఎడ్ల లావణ్య 857 ఓట్ల మెజారిటీ సాధించగా అత్యల్పంగా పటేల్‌గూడెంకు చెందిన పొన్నాల బుచ్చయ్య 4 ఓట్ల తేడాతో గెలుపొందారు.


