ఇప్పగూడెంలో 1,465 ఓట్ల మెజార్టీ..
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఇప్పగూడెంలో కాంగ్రెస్, సీపీఎం పార్టీలు బలపర్చిన అభ్యర్థి మందపురం రాణిఅనీల్‌గౌడ్ రికార్డు స్థాయిలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పగూడెంలో 4,472 ఓట్లు ఉండగా 3,820 ఓట్లు పోలయ్యాయి. అందులో మందపురం రాణికి 2,582 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి 1,117 ఓట్లు వచ్చాయి. మొత్తానికి రికార్డు స్థాయిలో 1465 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విక్టరీ సాధించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ రాణి మాట్లాడుతూ గ్రామంలో ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవతో పనిచేస్తానన్నారు.


