రాజకీయ అనుభవం లేకున్నా..
చిల్పూరు: ప్రజలు కోరిన విధంగా గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తానని మండల కేంద్రం అయిన చిల్పూరు గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన నలిమెల అనిత అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ ఎంబీఏ వరకు చదివిన తనకు రాజకీయంగా అనుభవం లేకున్నా గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని ఎమ్మెల్యే శ్రీహరి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. ముఖ్యంగా చిల్పూరు గుట్ట ఆలయానికి వచ్చే భక్తులతో పాటు గుట్ట చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి కోతుల బెడద నివారణకు పాటుపడతానని అన్నారు.


