స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి..
రఘునాథపల్లి: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని మేజర్ గ్రామపంచాయతీ రఘునాథపల్లి జీపీ (ఎస్సీ మహిళ) సర్పంచ్ అభ్యర్థిగా బొల్లం ఉమారాణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచింది. అధికార పార్టీ తరఫున పోటీ చేసిన నీలం వనమాలపై 567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి బొల్లం కుటుంబం కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తోంది. ఉమారాణికి అధికార పార్టీ నుంచి టికెట్ ఆశించినా.. అవకాశం ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఉమారాణి ప్రత్యేకతను చాటుకున్నారు.
జఫర్‌గఢ్‌లో..
జఫర్‌గఢ్: జఫర్‌గఢ్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కుల్లా మోహన్‌రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం చి త్తశుద్ధితో పని చేస్తానన్నారు. గతంలో కూడా సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించినట్లు తెలిపారు. ఈసారి కూడా తనను సర్పంచ్‌గా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి..


