అన్నివర్గాలకు సమన్యాయం
● డీసీసీ అధ్యక్షురాలు
ధన్వంతి
జనగామ: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి కొనియాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లేలా కోరారు. మంగళవారం ఏఐసీసీ అధినేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ధన్వంతి కేక్‌కట్ చేసి మాట్లాడారు.. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, నేడు సీఎం రేవంత్‌రెడ్డి పేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఓట్‌చోరీకి సంబంధించి ప్రతీ బూత్‌కు 100 అప్లికేషన్లు పంపించి సంతకాల సేకరణ చేస్తున్నామని, ఢిల్లీలో 14న జరిగే కార్యక్రమంలో పాల్గొంటామన్నారు. లక్ష్మీనారాయణ నాయక్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ రాజమౌళి, వంగాల మల్లారెడ్డి, కళ్యాణి, ఇందిర, డాక్టర్ కృష్ణ, బుచ్చిరెడ్డి, సుధాకర్, నర్సింగరావు, రామచందర్, వెంకట్‌రెడ్డి, సిద్దారెడ్డి, బాలరాజు పాల్గొన్నారు.


