ప్రత్యర్థుల పొత్తులాట! | - | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థుల పొత్తులాట!

Dec 9 2025 9:25 AM | Updated on Dec 9 2025 9:25 AM

ప్రత్

ప్రత్యర్థుల పొత్తులాట!

ప్రత్యర్థుల పొత్తులాట!

జనగామ: సర్పంచ్‌ ఎన్నికల్లో చిత్రవిచిత్ర రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. శత్రుత్వంగా కనిపించే పార్టీలు ఒక్కటవుతూ చేతులు కలిపేస్తున్నాయి. సర్పంచ్‌ కుర్చీ కోసం వింత పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో అనూహ్య కూటములు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. పలు మండలాల పరిధిలో కాంగ్రెస్‌, సీపీఎం, బీజేపీ మూడు పార్టీలు ఒకే అభ్యర్థి కోసం పనిచేస్తుండగా, మరికొన్ని గ్రామాల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకరికొకరు మద్దతిచ్చే పంచాయతీలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడో రెబల్స్‌కు ఇతర పార్టీల సపోర్ట్‌, ఆయా గ్రామాల పరిధిలో ఉప సర్పంచ్‌ పదవి కోసం ఒప్పందాలు.. ఇలా స్థానిక లెక్కలు, వ్యక్తిగత ప్రభావాలు, కుల సమీకరణాలు కలిసి గ్రామీణ రాజకీయాలను కొత్త దిశలో నడిపిస్తున్నాయి.

గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. జిల్లాల వారీగా ప్రచారం ముమ్మరమవుతున్న తరుణంలో పార్టీల పరస్పర శత్రుత్వం, ప్రత్యర్థిత్వం అన్నీ మసకబారిపోయాయి. కొత్త కొత్త పొత్తులతో ఓటర్ల ముందుకెళ్తున్నారు. జిల్లా స్థాయి రాజకీయాల్లో ఒకరికి ఒకరు బద్ధశత్రువుల్లా కనిపించే పార్టీలు గ్రామాలకు వస్తే స్నేహపూర్వకంగా చేతులు కలుపుతున్నారు. సర్పంచ్‌ పదవుల కోసం జరుగుతున్న ఈ చిత్ర విచిత్ర పొత్తులు ఇప్పుడు ప్రతీ మండలంలో చర్చనీయాంశమయ్యాయి.

స్టేషన్‌ఘన్‌్‌పూర్‌ మండలంలోని ఓ గ్రామంలో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థికి కాంగ్రెస్‌, సీపీఎం, బీజేపీ మూడు పార్టీలు కలిసి పనిచేయడం స్థానిక రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదే తరహాలో మరో మూడు పంచాయతీల్లో గ్రామాల్లో సీపీఎం–కాంగ్రెస్‌ కలిసి బలమైన కూటమిని ఏర్పరుచుకున్నాయి. జఫర్‌గఢ్‌ మండలంలోని ఓ గ్రామంలో రెండు విభిన్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. కూనూరు, జఫర్‌గఢ్‌, తమ్మడపల్లి(జీ)గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు కాంగ్రెస్‌–ిసీపీఎం కలిసి మద్దతు ఇస్తుండగా, ఓబులాపూర్‌ గ్రామంలో మాత్రం బీఆర్‌ఎస్‌–బీజేపీ కలిసి పనిచేయడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. చిల్పూరు మండలంలో ప్రత్యర్థులే ఇప్పుడు స్నేహితులుగా మారిపోయిన సంఘటనలు ఓటర్లను సైతం విస్మయానికి గురిచేస్తోంది. కృష్ణాజీగూడెంలో బీఆర్‌ఎస్‌కు బీజేపీ, సీపీఎం మద్దతుగా నిలుస్తున్నాయి. లింగాలఘణపురం మండలం జీడికల్‌ పంచాయతీలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తున్నాయి. బండ్లగూడలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థికి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్‌ నడుస్తోంది. గ్రామాధికారం కోసం అధికార, ప్రతిపక్షాలు కలిసిపోయాయనే చర్చ నడుస్తోంది. జనగామ మండలంలో పొత్తులు రెండు రకాలుగా నడుస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌–సీపీఐ కూటమి బలంగా కనిపిస్తుండగా, కొన్ని గ్రామాల్లో మాత్రం కాంగ్రె స్‌–బీజేపీ కలిసి పనిచేస్తుండటం రాజకీయ సమీకరణాలను క్లిష్టంగా మార్చేస్తోంది. రఘునాథపల్లి మండల పరిధిలో ఒప్పందాల రాజకీయాలు ఓటర్లను కన్ఫ్యూజ్‌ చేస్తోంది. నడిగొండలో సీపీఎం సర్పంచ్‌ అభ్యర్థికి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుండగా, కుర్చపల్లిలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థికి సీపీఎం వెన్నుదన్నుగా నిలుస్తోంది. గబ్బెట పంచాయతీలో ఉప సర్పంచ్‌ పదవి కోసం ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, కాంగ్రెస్‌ సర్పంచ్‌ అభ్యర్థికి సీపీఎం మద్దతు ఇవ్వడం మరో కొత్త మలుపు. బచ్చన్నపేట మండలం గోపాల్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి సీపీఎం మద్దతు ప్రకటించడం స్థానిక సమీకరణాలకు మరింత ఆసక్తిని తెచ్చింది.

హడావిడి

రాష్ట్రంలో శత్రువులు.. పల్లెల్లో మిత్రులు

సర్పంచ్‌ కుర్చీ కోసం... కోపతాపాలు పక్కకు

ఎవరు ఎవరితో.. ఆసక్తిగా గమనిస్తున్న ఓటర్లు

కొన్నిచోట్ల కాంగ్రెస్‌–సీపీఎం–బీజేపీ కూటమి

మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌–బీజేపీ కూటమి

గ్రామీణ రాజకీయంలో మారుతున్న సమీకరణాలు

ప్రత్యర్థుల పొత్తులాట! 1
1/5

ప్రత్యర్థుల పొత్తులాట!

ప్రత్యర్థుల పొత్తులాట! 2
2/5

ప్రత్యర్థుల పొత్తులాట!

ప్రత్యర్థుల పొత్తులాట! 3
3/5

ప్రత్యర్థుల పొత్తులాట!

ప్రత్యర్థుల పొత్తులాట! 4
4/5

ప్రత్యర్థుల పొత్తులాట!

ప్రత్యర్థుల పొత్తులాట! 5
5/5

ప్రత్యర్థుల పొత్తులాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement