‘అమ్మకు అక్షరమాల’ వేగవంతం చేయాలి
పాలకుర్తి టౌన్: జిల్లాలో నిరక్షరాస్యులకు అక్షరజ్ఞానం అందించే లక్ష్యంతో ప్రారంభిచిన ఉల్లాస్ శ్రీఅమ్మకు అక్షరమాలశ్రీ కార్యక్రమాన్ని మండలంలో మరింత బలోపేతం చేయాలని ఉల్లాస్, టాస్ జనగామ జిల్లా ఇన్‌చార్జి మురాల శంకర్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మండల సమాఖ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా మొత్తంలో ప్రారంభమైన అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని సీసీలు, వీఓఏలు సమన్వయంతో విజయవంతం చేసి మండలాన్ని జిల్లా స్ధాయిలో ప్రథమస్థానంలో నిలుపాలని సూచించారు. కార్యక్రమంలో సీసీలు వెంకటేశ్వర్లు, యాదగిరి, శోభ,ఉమ ప్రమీల, వీఓఏ పాల్గొన్నారు.


