రాజకీయ లెక్కలు–ప్రజా అభిప్రాయాలు
గ్రామాల్లో అభివృద్ధి, వ్యక్తిగత సంబంధాలు, కుల, సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకుల ప్రభావం ఇవన్నీ కలిసి విచిత్ర పొత్తులకు కారణమవుతున్నాయి. పాత శత్రుత్వాలు నీరుగారిపోయి, కొత్త ప్రయోజన సంబంధాలు పెరిగాయి. పార్టీ కంటే వ్యక్తులు, అభ్యర్థుల వ్యక్తిత్వం, స్థానిక ఇమేజ్ ప్రాధాన్యం ఎక్కువవుతోంది. సర్పంచ్ ఎన్నికలు గ్రామాల్లో నెలకొన్న అసలు రాజకీయ స్వభావాన్ని వెలికితీస్తున్నాయి. పైకి పార్టీ జెండాలు వేరైనా, అధికారం కోసం లోపల మాత్రం లెక్కలు ఒక్కటిగా బావిస్తున్నారు. ఈ అనూహ్య కూటములు గ్రామీణ రాజకీయాల్లో వచ్చే రోజుల గమనాన్ని ఎలా మార్చతాయో వేచి చూడాలి.
రాజకీయ లెక్కలు–ప్రజా అభిప్రాయాలు


