నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
జనగామ: జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈనెల 9న (మంగళవారం) ఉదయం 10 గంటలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ సోమవారం పరిశీలించారు.
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
జనగామ రూరల్: ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి. పింకేశ్ కుమార్ అన్నారు. సోమవారం సోమవారం కలెక్టరేట్ కార్యాలయ రిటర్నింగ్ అధికారుల ఫేజ్ –2లో విధులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధికారులు ముందుగానే సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేసుకుని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలుచేయాలని సూచించారు. ఎన్నికల అధికారులు తమ ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్, ఓటర్ ఐడీ కార్డు, ఫారం–14 పోస్టల్ బ్యాలెట్ వినతిపత్రంతో సంబంధిత కేంద్రాలకు హాజరవ్వాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మాధురి షా, మాస్టర్ ట్రైనర్లు మెరుగు రామరాజు, సురేందర్‌రెడ్డి, నరసింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రాపూర్
ఉప సర్పంచ్ ఎన్నిక
బచ్చన్నపేట: మండలంలోని రామచంద్రాపూర్ గ్రామ ఉప సర్పంచ్‌గా నల్ల రవీందర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి–2 ఇర్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో వార్డు సభ్యులు నల్ల రవీందర్‌రెడ్డి, ఆముదాల లావణ్య, పొన్నబోయిన బాలమణి, నర్మెట సుజాత, వేములవాడ నరేష్, ఒగ్గు అంజనేయులు, పెరుమాల్ల యాదగిరి, చొప్పరి మల్లేశం పాల్గొని రవీందర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఎన్నికై న ఉప సర్పంచ్‌కు ఎన్నికల అధికారి, గ్రామ సర్పంచ్ బొందుగుల వినోద్‌కుమార్ ఎన్నిక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు.
నేడు ‘మూడో విడత’ విత్‌డ్రాలు
కొడకండ్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత షెడ్యూల్‌లో భాగంగా అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగుస్తుంది. మండలంలో 21 గ్రామ పంచాయతీ సర్పంచ్, 190 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికల బరిలో నిల్చిన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. కాగా కొందరు పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచ్, వార్డుసభ్యులకు కూడా నామినేషన్లు దాఖలు చేయగా వారిని ఉపసంహరించుకోవాలంటూ పార్టీల అభ్యర్థులు బుజ్జగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం కూడా చర్చలు నడుస్తుండగా ఎవరు ఉపసంహరించుకుంటారో? బరిలో ఎవరుంటారో? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
పోలీసుల విస్తృత తనిఖీలు
జనగామ: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై మండలంలోని పెంబర్తి చెక్‌పోస్టు వద్ద సోమవారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో చెక్‌పోస్ట్ వద్ద నాకాబందీ చేపట్టారు. అక్రమ నగదు, మద్యం, ఆయుధాలతో పాటు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ఇతర నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకునేందుకు నిరంతరం నిఘా ఉంచామన్నారు.
అభ్యర్థులు నిబంధనలు పాటించాలి
జనగామ రూరల్: స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలని ఏసీపీ పండారీ చేతన్ నితిన్ సూచించారు. సోమవారం ఎంపీఓ మహేశ్ ఆధ్వర్యంలో మండలంలోని చీటకోడూర్ రైతు వేధికలో అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఓటర్లను ప్రభావితం చేసే వారిపై కఠిన వైఖరి అవలంబిస్తామని హెచ్చరించారు.
నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ


