వ్యర్థానికి శాసీ్త్రయత జోడింపు
● ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్
బ్రాండ్ అంబాసిడర్ గౌసియాబేగం
లింగాలఘణపురం: సృష్టిలో వ్యర్థ పదార్థాలకు శాసీ్త్రయత జోడించడమే ప్రధానమని, దాంతో ఏదీ వ్యర్థం కాదని ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అంబాసిడర్ గౌసియాబేగం అన్నారు. సోమవారం మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో జిల్లాలోని 13 కేజీబీవీ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో వేస్ట్ అండ్ వెల్త్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్‌ను ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ బ్రాండ్ అంబాసిడర్, జీసీడీఓ గౌసియాబేగం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎగ్జిబిట్స్‌లో ప్రథమ స్థానం లింగాలఘణపురం కేజీబీవీ, ద్వితీయ స్థానం నర్మెట, తృతీయ స్థానం టీఎస్‌ఎంఎస్ లింగాలఘణపురం, ప్రోత్సాహక బహుమతి కేజీబీవీ బచ్చన్నపేట మండలాలకు దక్కింది. ఈ సందర్భంగా వారికి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్థానిక కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణతో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


