నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
● డీసీపీ బి. రాజమహేంద్ర నాయక్
నర్మెట: ఎన్నికల కమిషన్ విధించిన నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీసీపీ బి. రాజమహేంద్రనాయక్ హెచ్చరించారు. రెండో విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని సర్పంచ్, వార్డు సభ్యులకు వినాయక గార్డెన్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రవర్తన నియమావళి అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో, ఓటింగ్ , లెక్కింపు సమయంలో, ఖర్చుల విషయంలో పాటించవలసిన నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ఖర్చుల అబ్జర్వర్ జయశ్రీ, అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అథారిటీ, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, తహసీల్దార్ మొహసిన్ ముత్జాబ, సీఐ ముసుకు అబ్బయ్య, ఎస్సై నైనాల నగేష్, ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, ఎంపీఓ ఏవి. మల్లికార్జున్, ఆడిట్ అబ్జర్వర్ విజయ్, జోనల్ అధికారి సుకన్య, శుక్ల, డీటీ కురికాల వేణు, మాస్టర్ ట్రైనీస్, పోటీలో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు.


