ఎన్నికల నియమావళిని అతిక్రమించొద్దు
● జిల్లా ఎన్నికల వ్యయ పర్యవేక్షణాధికారి జయశ్రీ
తరిగొప్పుల: ఎన్నికల నియమావళిని అతిక్రమించొద్దని, స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా కృషిచేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పర్యవేక్షణాధికారి జయశ్రీ సూచించారు. ఎంపీడీఓ బోజనపల్లి లావణ్య అధ్యక్షతన సోమవారం రైతు వేదికలో ఎన్నికల నియమావళిపై సర్పంచ్, వార్డు సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్‌రెడ్డి, సీఐ అబ్బయ్య, ఎస్సై శ్రీదేవి, రామారావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


